Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 29 March 2022, 5:16 pm Posted by : Anjaneyulu Dega

కవిత, రేవంత్ ట్వీట్ వార్..?

హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై రాహుల్ ట్వీట్ కు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం ట్విటర్ లో సంఘీభావం తెలపడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదని చెప్పారు. పంజాబ్, హరియాణాలో చేసినట్లు తెలంగాణ ధాన్యం సేకరించాలని కోరుతున్నామన్నారు. తెరాస ఎంపీలు పార్లమెంట్ నిరసన వ్యక్తం చేస్తున్నారని కవిత తెలిపారు. ఒకే దేశం- ఒకే సేకరణ విధానం కోసం రాహుల్ డిమాండ్ చేయాలని ఆమె సూచించారు. ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. పార్లమెంట్ లో తెరాస ఎంపీల పోరాటం అనేది అబద్ధమన్నారు. తెరాస ఎంపీలు పార్లమెంట్ లో కాలక్షేపం చేస్తున్నారని చెప్పారు. ఎఫ్సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఒప్పందపై కేసీఆర్ సంతకం చేశారన్నారు. కేసీఆర్ సంతకం.. ఇవాళ తెలంగాణ రైతులు మెడకు ఉరితాడైందని చెప్పారు. మరోవైపు రాహుల్ ట్వీట్ పై రేవంత్ స్పందించారు. తెలంగాణ రైతుల ఆవేదన అర్ధం చేసుకున్న రాహుల్ కు ధన్యవాదాలు అని తెలిపారు. ధాన్యం సేకరణలో భాజపా, తెరాస ప్రభుత్వాల వైఖరి దారుణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. రైతులను ఇబ్బంది పెట్టడం ఆపాలని.. ప్రతి ధాన్యం గింజా కొనాలని డిమాండ్ చేస్తూ ఆయన తెలుగులో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.