Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 March 2022, 4:21 pm Posted by : Anjaneyulu Dega

బస్టాండ్ లో సౌకర్యాలు కరువు..?

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసి విఫలం అవుతుంది. గత కొన్ని నెలలుగా బస్టాండులోని ఫ్యాన్లు చెడిపోయినా వాటి మరమత్తులు కూడా చేయించలేని దుస్థితి నెలకొంది. ఇక్కడ ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉండవు జిల్లా అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అసలే ఎండాకాలం ఎండలు దంచి కొడుతున్నాయి. వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి ప్రజలు వస్తుంటారు కానీ ఈ బస్టాండ్ లో ఫ్యానులు లేక, సరైన సౌకర్యాలు లేక ప్రజలు వేడికి తీవ్ర ఇబ్బందుకు పడుతున్నారు. ఏసీ కార్లలో ప్రయాణం చేసే ప్రజాప్రతినిధులకు, అధికారులకు సామాన్య ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ప్రజలకు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ప్రయాణ ప్రాంగణంలో ఫ్యాన్ల మరమత్తులయ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు..