Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 March 2022, 9:24 pm Posted by : Anjaneyulu Dega

గుర్తుకొస్తున్నాయి.. న్యూయార్క్ నగర వీధుల్లో కేటీఆర్

న్యూయార్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన కేటీఆర్.. తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో, ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ వీధుల్లో కాసేపు గడిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో తనకు అత్యంత ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ వేడి వేడి సాస్ తో కూడిన చికెన్ రైస్ తిన్నారు. ఆ తర్వాత సమావేశానికి ఆలస్యం అవుతుండడంతో న్యూయార్క్ లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు. కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలా వరుసలో నిలబడి తన ఆహారం కొనుక్కోవడం, తర్వాత మీటింగ్ క్యాబ్ లో వెళ్లడం.. వంటి విషయాలను ఉదయం నుంచి కేటీఆర్ తో ఉన్న తెలుగు ఎన్నారైలు గమనించి ఆశ్చర్యపోయారు. ఆయన సాధారణ జీవన శైలి, నిబద్ధతను చూసి అభినందనలు తెలిపారు.