రాజ్యసభకు హర్భజన్ సింగ్..?

చండీగఢ్: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అతి త్వరలోనే రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ భజ్జీని పంజాబ్ నుంచి తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ నెలాఖరులో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఐదు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అందులో ఒక స్థానానికి భజ్జీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పంజాబ్లో భగవంత్ మాన్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఆప్ ప్రభుత్వం.. భజ్జీకి స్పోర్ట్స్ యూనివర్శిటీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సదరు...