పంజాబ్ కొత్త సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం..
పంజాబ్: పంజాబ్ లో 'ఆమ్ ఆద్మీ' ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. మాన్ చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఇదే వేదికపై సీఎం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ప్రజలంతా బాసంతి (పసుపు రంగు) తలపాగాలు...