Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 March 2022, 6:47 am Posted by : Anjaneyulu Dega

వైద్యుడి నిర్లక్ష్యం… వ్యక్తి మృతి..?

విచారణ చేపట్టి వారికీ న్యాయం చేస్తాం: సీఐ బాబు రావు

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి కీ చెందిన వ్యక్తి కొమ్ము పోశం కూలీ పని చేసి జీవనం సాగిస్తూంటాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు మంగళవారం రోజు ఆరోగ్య సమస్య వల్ల మంచిర్యాల పట్టణంలోని హెల్త్ కేర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారని. పోశం పరిస్థితి విషమించడంతో డాక్టర్ మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ వెళ్లాలని శుచించడంతో పోశం ని కుటుంబసభ్యులు తీసుకెళ్లే క్రమంలో మార్గామాధ్యలో చనిపోయాడని వారు వాపోయారు…

కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… డాక్టర్ సరిగ్గా పట్టించుకోలేదని ఎన్నిసార్లు పేషెంట్ ని చూడమన్న రాలేదని మంగళవారం ఉదయం హాస్పటల్లో అడ్మిట్ అయ్యాము సాయంత్రం అయినా కూడా డాక్టర్ వచ్చి చూడలేదని ట్రీట్మెంట్ మాత్రం నడుస్తోందని హాస్పటల్ సిబ్బంది తెలియజేశారు.. తీరా సాయంత్రం అయినాక డబ్బులు అన్నీ కట్టించుకొని  మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ వెళ్లాలని అన్నరు.. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే కుమ్ము పోశం చనిపోయాడని కుటుంబ సభ్యులు వాపోయారు. మార్గ మధ్యలో అంబులెన్సు డ్రైవర్ పోశం చనిపోయిన విషయం గ్రహించి డబ్బులు ఎక్కువ ఇస్తేనే మృతదేహన్ని ఇంటికి చేరుస్తానని బెదిరించి అనాధ శవం లాగా వదిలేసివెళ్లడని వేరే అంబులెన్సు మాట్లాడుకొని ఇంటికి చేరుకున్నామని, సరైన న్యాయం జరగాలని పోలీసులను వేడుకున్నారు బెల్లంపల్లి రూరల్ సీఐ బాబు రావు మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్ట్ ని బట్టి విచారణ చేపట్టి వారికీ సరైన న్యాయం చేకూరెలా చేస్తానని తెలిపారు..