మద్యం దుకాణం ధ్వంసం చేసిన మాజీ సీఎం..!
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతికి కోపం వచ్చింది. మద్యాన్ని నిషేధించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న ఆమె.. తాజాగా భోపాల్లోని ఓ మద్యం దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఓ బండరాయితో లిక్కర్ దుకాణంలోకి నేరుగా వెళ్లిన ఆమె మద్యం బాటిళ్లను పగులగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉమాభారతి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని ఆమె ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. 2022 జనవరి 15 నాటికి రాష్ట్రంలో లిక్కర్ విక్రయాలను...