విమాన తయారీ కర్మాగారంపై రష్యా దాడి..!

ఆంజనేయులు న్యూస్: రష్యా దళాలు కీవ్ లో భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. కీవ్ ఉత్తర శివార్లలో యాంటోనోవ్ విమానాల తయారీ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకొన్నాయి. నగరానికి 10 కిలోమీటర్ల దూరంలోని యాంటినోవ్ ఎయిర్ ఫీల్డ్ వద్ద ఈ కర్మాగారం ఉంది. కర్మాగారం సమీపం నుంచి భారీగా పొగ వెలువడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్యా దళాల శతఘ్ని దాడుల కారణంగా మంటలు వ్యాపించినట్లు నిపుణులు భావిస్తున్నారు. భారీ భవనాలు, ప్లాంట్ల లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది....