చార్మినార్ పై ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీ.. కేసు నమోదు..
హైదరాబాద్ చార్మినార్: భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. చార్మినార్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీని ఆవిష్కరించిన తెరాస నేతలపై కేసు నమోదైంది. ఆదివారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస మొఘల్ పూర్ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ణ.. మరో నాయకుడు మణికొండ విజయ్ కుమార్ తో కలిసి చార్మినార్ పై శనివారం ఆమె చిత్రపటంతో కూడిన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ ఫ్లెక్సీని తొలగించారు. చారిత్రక కట్టడంపై చిత్రపటాల్ని ఆవిష్కరించడం నిబంధనలకు విరుద్ధమని చార్మినార్ కన్జర్వేటర్ రాజేశ్వరి తెలిపారు. ఆమె...