చిరుత మాంసంతో విందు.. నిందితుల అరెస్ట.
పశ్చిమ బెంగాల్: చిరుతను వేటాడి ఆ మాంసంతో ముగ్గురు దుండగులు విందు చేసుకున్నారు. అంతేకాదు.. ఆ చిరుత చర్మాన్ని, గోళ్లను అక్రమ రవాణా చేసేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని శిలిగుడిలో వెలుగులోకి వచ్చింది. చిరుతను వేటాడిన ఫొటో నిందితులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం. వల్ల ఆ ఘటన అధికారుల దృష్టికి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు 15 రోజుల తర్వాత నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు ముకేశ్ కేకెట్టా,...