రన్వే పక్కకు దూసుకెళ్లిన విమానం..
ధిల్లీ: మధ్యప్రదేశ్ లోని జబల్పుర విమానాశ్రయంలో దిగేందుకు ప్రయత్నించిన ఓ విమానం.. పెను ప్రమాదం నుంచి బయటపడింది. ల్యాండింగ్ సమయంలో ఏటీఆర్-72 విమానం.. రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లింది. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారని... అయితే ఎవరూ గాయపడలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారులు వెల్లడించారు. ఈ విమానాన్ని అలయన్స్ ఎయిర్ సంస్థ నడిపిస్తోంది. ఢిల్లీ నుంచి ఉదయం 11.30 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 1.15 గంటలకు జబల్పుర్ వచ్చిన...