కేంద్రమిచ్చే రూ.200-300 కోట్లు ఏ మూలకు సరిపోతాయి?: కేటీఆర్
గుజరాత్ కు మాత్రం రూ. వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు.. హైదరాబాద్: హైదరాబాదు విశ్వనగరంగా మార్చేందుకు శ్రమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో మురుగునీరు, మంచినీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ పారిశుద్ధ్యం నిర్వహణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు.. “హైదరాబాద్ లో రూ.3,866 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్ఓపీ) ఏర్పాటు చేస్తున్నాం. ఈ డిసెంబర్ నాటికి వందశాతం ఎస్టీపీ పనులు పూర్తి అవుతాయి. హైదరాబాద్ లో 37...