భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ..
హైదరాబాద్: శాసనసభ నుంచి భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సస్పెన్షన్ ప్రొసీడింగ్స్, వీడియో రికార్డింగ్లను తమకు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలన్న భాజపా ఎమ్మెల్యేల అభ్యర్థనను కూడా ఉన్నత న్యాయస్థానం. తోసిపుచ్చింది. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న వాదనలు జరిగాయి. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేయలేక పోయినట్లు భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టు రిజిస్ట్రీకి...