ఇక టార్గెట్‌ తెలంగాణ..!

బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి.. వచ్చే నెలలో రాష్ట్రానికి అమిత్‌ షా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అసంతృప్తులపై నజర్‌ హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల్లో సాధించిన అద్భుత ఫలితాల ఉత్సాహంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఇక తెలంగాణను టార్గెట్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టేందుకు సమాయత్తం అవుతోంది. ‘ఇక మా ఫోకస్‌ తెలుగు రాష్ట్రాలపైనే ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకువెళ్తాం’ అంటూ కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ గురువారం...