అహ్మదాబాద్ లో మోదీ భారీ రోడ్ షో..
అహ్మదాబాద్: ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల భాజపా అఖండ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్నారు. నేటి ఉదయం అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం విమానాశ్రయం నుంచి భాజపా రాష్ట్ర కార్యాలయం 'శ్రీకమలం' వరకు ప్రధాని భారీ రోడ్ షో చేపట్టారు. ఇందులో దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు సమాచారం. ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణిస్తూ ప్రజలందరికీ మోదీ అభివాదం...