కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత.. ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యులు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు గుండె, యాంజియో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది. అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, మనవడు హిమాన్హ్, ఎంపీ సంతోష్ ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లు యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. యాంజియోగ్రామ్ నిర్వహించాం...