డీజిల్ పై ఒకేసారి రూ.75 పెంపు.. లీటరు పెట్రోల్ రూ.254
కొలంబో: ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎలస్ఐఓసీ) ఇంధన ధరలను భారీగా పెంచింది. దీంతో ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. లీటర్ డీజిల్ పై రూ.75(శ్రీలంక రూపాయి), పెట్రోల్పై రూ. 50 చొప్పున పెంచినట్లు ఎల్ఐఓసీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా లీటరు పెట్రోల్ ధర రూ.254కు చేరగా.. డీజిల్ ధర రూ.214కు...