కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితుల నిరసన..

మంచిర్యాల జిల్లా: అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ లో ఏవో సురేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ 1995లో ప్రారంభించిన అగ్రిగోల్డ్ కంపెనీలో డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయని నమ్మించి డిపాజిటర్ల పేర్లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో దాదాపు రూ. 5 వేల కోట్లు వసూలు...