ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్ట్
ముందస్తు బెయిలు దరఖాస్తును తిరస్కరించిన కోర్టు ఆ వెంటనే కస్టడీలోకి తీసుకున్న సీబీఐ ఎన్ఎస్ఈ రహస్య సమాచారాన్ని ‘యోగి’తో పంచుకున్నట్టు అభియోగాలు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ నిన్న అరెస్ట్ చేసింది. 59 ఏళ్ల చిత్ర పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో సీబీఐ అధికారులు నిన్న న్యూఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేశారు. 2013-2016 మధ్య చిత్ర ఎన్ఎస్ఈ సీఈవోగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని హిమాలయాల్లో నివసించే ‘యోగి’తో ఈ-మెయిల్ ద్వారా...