ఆనం సైకిల్ ఎక్కుతారా…
నెల్లూరు, ఫిబ్రవరి 23: ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదన్నది ఒక కారణమైతే తనకు వ్యతిరేకంగా వైసీపీలో కుట్ర జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే జిల్లాల విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేరుకు మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని ఆనం రామనారాయణరెడ్డి కోరుతున్నప్పటికీ ఆయన డిమాండ్ వేరే ఉందంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీికి మరోసారి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఆనం తెలుగుదేశం పార్టీ నుంచే గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చారు. 2014లో తాను...