పవన్ కు సర్కార్ గుడ్ న్యూస్

విజయవాడ, ఫిబ్రవరి 23: ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుకు ముహూర్తం ఖరారైంది. రేపు లేదా ఎల్లుండి రేట్లపై జీవో జారీ చేయనుంది సర్కార్. ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమకు ఇబ్బంది లేకుండా ధరలు ఖరారు చేసినట్లు సమాచారం. కనీస ధర 40, గరిష్ట ధర 140గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో సినిమా టిక్కెట్ పంచాయతీకి తెరపడనుంది. కొంతకాలంగా నెలకొన్న రేట్ల వివాదానికి సీఎం జగన్ చెక్ పెట్టనున్నారు. సినిమా హాళ్లలో టికెట్ రేట్లు నిర్ణయిస్తూ గతంలో విడుదల చేసిన జీవో...