కేసీఆర్ వ్యూహాత్మక తప్పటడుగులేనా..?
హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఓ గొప్ప రాజకీయ వ్యూహ కర్త. అంతే కాదు,రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సూత్రాన్ని చాలా చక్కగా వంట పట్టించుకున్న నాయకుల్లో అయన ముందు వరసలో ఉంటారు. నిజానికి, ఇన్నయ్య మొదలు ఈటల దాకా నడిచిన చరిత్రను చూస్తే, శాశ్వత మిత్రులు ఉండరు కాదు, ఉండ’కూడదు’ అనేదే కేసీఆర్ నిశ్చితాభిప్రాయం అనిపిస్తుంది. అందుకే,ఎవరిని, ఎప్పుడు, ఎలా వాడుకోవాలో, ఎవరిని, ఎప్పుడు, ఎలా వదిలేయాలో, ఆయనకు తెలిసినంతగా...