13వ బెటాలియన్ లో ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో గుడిపేట 13 బీఎన్ టీజీ ఎస్పీ బెటాలియన్ లో తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం కమాండంట్ వెంకటరాములు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండంట్ వెంకటరాములు మాట్లాడుతూ.. ప్రస్తుత జీవన శైలి లో ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళకి ధ్యానం సమగ్ర పరిష్కారం చూపుతుంది అని, ఆరోగ్యకరమైన సమాజానికి ద్యానం దోహదం చేస్తుందన్నారు. డిసెంబర్ 21 ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం దేశానికి గర్వకారణం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండంట్ లు నాగేశ్వరరావు, కాళిదాసు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్స్, బెటాలియన్ అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.