Telugu Updates
Logo
Natyam ad

మానవత్వాన్ని చాటిన వ్యక్తిని సన్మానించిన జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని వాంకిడి మండలం ఇందాని ఎక్స్ రోడ్ దగ్గర మంగళవారం రోజు వాంకిడి నుండి ఆసిఫాబాద్ వస్తున్న ద్విచక్ర వాహనాన్ని, మహారాష్ట్ర వెళ్తున్న ఐచర్ వ్యాన్ ఢీ కొనడం జరిగింది. ఈ ప్రమాదంలో నికేసరి భీమ్రావు, నికేసరి రాజశేఖర్ అనే తండ్రి కొడుకులు అక్కడికక్కడే మరణించారు మరియు మహర్లే భీమ్రావు అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్నటువంటి వాంకిడి మండలం ఇందాని గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి సకాలంలో స్పందించి 100 ద్వారా పోలీసులకి, 108 ద్వారా అంబులెన్స్ ఫోన్ చేయడం జరిగింది.. ప్రమాద స్థలాన్ని చేరుకున్న పోలీసులు బాధితుల్ని అంబులెన్స్ లో ఎక్కించి, నిందితుని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి, మహారాష్ట్ర బార్డర్ లో వాహనంతో సహా పట్టుకోవడం జరిగింది. మానవతా దృక్పథంతో స్పందించిన గుర్నులే మారుతి అనే వ్యక్తిని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ గురువారం సన్మానించారు.. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథం మరియు సేవాభావం కలిగి ఉండాలని తెలియజేశారు…

మారుతి అనే వ్యక్తి సకాలంలో సమాచారం అందించడం ద్వారా మహర్లే భీమ్రావు అనే వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగామని అని తెలియజేశారు. ప్రమాద సమయంలో మరణించిన వ్యక్తులు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణహాని జరిగి ఉండకపోవచ్చు అని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ.. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సిఐ శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.